Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2వ తేవీన లంగర్ హౌజ్‌లోని బాపూఘాట్‌కు గవర్నర్, ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు విచ్చేసి మహాత్మునికి నివాళులర్పిస్తారనీ, అందుకు అవసరమైన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా చేయాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గాంధీ జయంతి ఏర్పాట్లపై పర్యాటక, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్ వర్క్స్, ఆర్అండ్బీ, హర్టికల్చర్, విద్య, సమాచార, ఫైర్, తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బాపూఘాట్లో గాంధీ జయంతి సంద ర్భంగా వివిధ శాఖల తరపున చేయాల్సిన పనులను ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. పర్యాటకశాఖ అధికారులు షామియానాలు, ఘాట్‌ను అందంగా పూలతో అలంకరించాలని సూచించారు. ముఖ్యంగా బాపూ సమాధి, ప్రార్థన మందిరంతో పాటు ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉండేటట్టు చూడాలనీ, వైట్ క్లాత్‌తో సైడ్ వాల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్అండ్బీ, పోలీ సుశాఖ అధికారుల సహకారంతో అవసరమైన చోట బ్యారికేడింగ్ చేయాలన్నారు. జలమండలి అధికారులు బాపూఘాట్ సందర్శనార్థం వచ్చే సందర్శకులకు తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. సమాచార పౌర సంబంధాల శాఖ తరపున హిందూ, ముస్లిం, క్రైస్తవ, బుద్ధ, సిక్కు మత గురువుల ప్రార్థనలు ఏర్పాటు చేయడంతో పాటు భక్తి, భజన కీర్తనల కార్యక్రమాన్ని నిర్వహించాల న్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూడాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంత రాయం లేకుండా చూడాలని విద్యుత్తు శాఖ అధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ తరపున అత్యవసర వైద్య సదుపాయాలతో కూడిన అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలన్నారు. ఆ ప్రాంతంలో అవసరమైన మేరకు సివిల్ వర్క్స్ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటి, డీఈవో ఆర్.రోహిణి, గోల్కొండ తహసీల్దార్ శైలజ, తదితరులు పాల్గొన్నారు.