Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్/సిటీబ్యూరో
కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకురా వాలనే సంకల్పంతో చిన్న చిన్న కుల వృత్తుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌లో పలు దుకాణాలు తెరిపించి గౌడ్ల ఆత్మగౌరవాన్ని నిలిపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు వైన్ షాప్‌లల్లో రిజర్వేషన్లు కల్పించినం దుకు క్యాబినెట్ మీటింగ్‌లో తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కులసంఘాలతో రవీంద్రభారతిలో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కాలం నాటి నుంచి ఉన్న డిమాండ్ అనీ, ఏ ప్రభుత్వాలూ వృత్తి పన్ను రద్దు చేయలేదనీ, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ రద్దు చేసి ఉచితంగా గీత కార్మికులకు లైసెన్సులు జారీ చేశారని తెలిపారు. సీఎంకు కుల వృత్తులు, పేద ప్రజలు అంటే ఎంతో అభి మానం అన్నారు. దళితులు, గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో దళితబంధును తీసుకొచ్చారనీ, అందులో భాగంగా వైన్ షాప్‌లలో దళితులకు 10 శాతం, గిరిజనులకు 5 శాతం, గౌడ్లకు 15 శాతం వాటాను కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకు న్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు కులవృ త్తులను నాశనం చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కుల వృత్తుల అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకువ చ్చేందుకు గౌడ్లకు 15 శాతం వైన్ షాప్‌లలో వాటా కల్పించాలని తీసుకున్న నిర్ణయం చరిత్రా త్మకమైనదన్నారు. కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకు వచ్చే భాగంలో నాయీ బ్రాహ్మణులకు సెలూన్లు, రజకులకు ఆధునిక వాషింగ్ మిషన్లు, యాదవులకు గొర్రెలు, ముదిరాజులకు వారి వృత్తికి సంబంధించిన ప్రోత్సాహకాలను అంది స్తున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు వెయ్యి స్కూల్స్ ఏర్పాటు చేసి ఆధునిక విద్యను అందిస్తున్నారని తెలిపారు. కుల వృత్తులను కాపాడుకోవాలనీ, సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి అన్ని కులాల, వృత్తుల ప్రజలు అండగా ఉండా లని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం జాతీయ స్థాయి విప్లవా నికి నాందిగా నిలువబోతుందన్నారు. ఇప్పటికే దేశంలో వివిద రాష్ట్రాలైనా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి ఫోన్లు వస్తున్నాయన్నారు. దేశంలో 60 శాతానికి పైన ఉన్న బీసీలకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ శాఖ ఏర్పాటు చేయలేదన్నారు. బీసీల అభి వృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఈ స్కీంను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తూన్నాయన్నారు. గౌడ్లు, ఎస్సీ, ఎస్టీ ప్రజలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాల న్నారు వైన్ షాప్‌లలో గౌడ్లకు 15 శాతం వాటా ను కల్పించినందుకు స్వాగతించారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమా వేశంలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్‌గౌడ్, ప్రభుత్వ విద్యా మౌలిక సదుపాయాల కల్పనశాఖ చైర్మెన్ నాగేందర్‌గౌడ్, గౌడ సంఘాల రాష్ట్ర నాయకులు పల్లె లక్ష్మణరావుగౌడ్, బాలగొని బాలరాజుగౌడ్, మాజీ చైర్మెన్ రాజేశంగౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, ప్రతాని రామకృష్ణ గౌడ్, డా.విజయ భాస్కర్ గౌడ్, నాగేశ్వరరావు, ఎలికట్టే విజరు కుమార్ గౌడ్, వేములయ్య గౌడ్, చింతల మల్లేశం గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, రాజయ్య గౌడ్, ప్రతాప్ లింగం గౌడ్, అంబాల నారాయణ గౌడ్, యూనివర్సిటీ స్కాలర్స్ కేషబోయిన రవికుమార్ గౌడ్, గదరాజు చందు, రాథోడ్ నాయక్, శ్రీరామ్ గౌడ్, ఎస్సీ నాయకులు జంబులయ్య, ఎస్టీ నాయకులు కిషన్ నాయక్, తదితర రాష్ట్ర నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.