Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మీర్పేట్
తెలంగాణ రాష్ట్ర సమితి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ప్రధానంగా ముగ్గురు (ద్విముఖ) పోటీలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే ఇద్దరు బీసీి సామాజిక వర్గానికి చెందిన వారు. మరొకరు గత ఏడాది అధ్యక్ష పదవికి తీవ్రంగా పోటీలో ఉండి మంత్రి సూచన మేరకు చివర్లో ప్రయత్నాలు విరమించుకున్నవారు. ఈ ముగ్గురు మీర్పేట్ టీిఆర్ఎస్ పార్టీలో మంచి బలమున్న ముఖ్య నాయకులే. కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల వర్గ విబేధాల రీత్యా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో.. కౌన్ బనేగా అధ్యక్ష ...? ఎవరు అవుతారో నేడో రేపో తేలిపోతుంది.
టీిఆర్ఎస్ అధ్యక్ష పదవికి ద్విముఖ పోటీ..
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా కమిటీలు ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు. దాంతో మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు కమిటీలు ఇప్పటికే పూర్తి చేశారు. కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ప్రధానంగా ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నారు. గత ఏడాది తీవ్రంగా అధ్యక్ష పదవికి పోటీ పడి మంత్రి సూచనల మేరకు పోటీ నుండి తప్పుకున్న జిల్లెలగూడ మాజీ ఎంపీటీసీ టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్ ప్రెసిడెంట్) అర్కల కామేష్రెడ్డి, ప్రస్తుతం తెలంగాణలో రాజకీయలో దళిత సమీకరణాలు నడుస్తున్న పరిస్థితుల్లో కమిటీల్లో సామాజిక వర్గానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు టీిఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు దిండు భూపేష్గౌడ్, మరో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సిద్దాల బాలప్ప అధ్యక్ష పదవికి తీవ్రంగా పోటీ పడుతున్నారు. మరి వీరిలో ఎవరిని వరిస్తుందో చూడాలి...
మంత్రి నిర్ణయమే శిరోధార్యం...
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎక్కువ మంది అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీిఆర్ఎస్ పార్టీ నాయకుల్లో పెద్ద ఎత్తున వర్గ విబేధాలు ఉండటంతో ఏ వర్గానికి చెందిన వారు ఆ వర్గాల నాయకులు అధ్యక్ష పోటీలో ఉన్నారు.
ఎందరు పోటీ పడినా పార్టీని పటిష్ట పరిచేందుకు అందరినీ కలుపుకొని పని చేస్తారో వారికే అధ్యక్ష పదవని ఉంటుందని, మంత్రి నిర్ణయమే శిరోధార్యం కావడంతో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నాయకులు మంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో వర్గ విబేధాలు ఉండటంతో దాన్ని అధిగమించేందుకు మంత్రి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకునికే అధ్యక్ష పదవి వస్తుందని టీిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేడో రేపో ప్రకటించే మీర్పేట్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో