Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ పట్టణ కేంద్రంలో ఉచితంగా మధుమేహం, థైరాయిడ్ వ్యాధి నిర్ధారణ కోసం హయతి హెల్త్ కేర్ పాలిక్లినిక్, కనెక్ట్ డయాజ్ఞస్టిక్స్ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ అల్వాల్ సర్కిల్ హెచ్ఎంటీ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంపులో సుమారు 200 మంది స్థానికుల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్‌ను పరీక్షించి రిపోర్టుల ఆధారంగా వారికి సలహాలు, సూచనలతోపాటు ఉచితంగా మందులను పంపిణీ చేశామని జనరల్ పిజీషియన్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నవవికాస్ జూకంటి తెలిపారు. మధుమేహానికి సంబంధించి ఎఫ్,బి. ఎస్ హెచ్.బి.ఏ.1సి కిడ్నీ పనితీరుకు సంబంధించిన సీరం క్రియాతినిన్, థైరాయిడ్‌కు సంబంధించి టి.ఎస్.హెచ్ వంటి పరీక్షలను ఈ హెల్త్ క్యాంపు ద్వారా చేస్తున్నట్టు డాక్టర్ తెలిపారు. 50, 60 ఏండ్ల వయస్సు వారు ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిదని డాక్టర్ నవవికాస్ సూచించారు.