Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
జన విజ్ఞాన వేదిక అల్వాల్ మండల మహా సభలు ఆదివారం జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యాలయంలో జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక మండల కమిటీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో అనేక సృజనాత్మక కార్యక్రమాలు చేపడు తున్నారన్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో చెకుముకి టాలెంట్ టెస్ట్‌లు నిర్వహించడం, ఉగాది రోజున కూల్ డ్రింక్స్‌కు వ్యతిరేకంగా సహజసిద్ధ పానీయాలు సేవించాలని ప్రచారం చేస్తూ ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం, మూఢనమ్మ కాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమలు విజయవంతంగా నిర్వహిస్తున్నందు కు కమిటీని అభినందించారు. అనంతరం నూత న కమిటీని ఎన్నుకున్నారు. అల్వాల్ మండలం జనవిజ్ఞానవేదిక అధ్యక్షులుగా సబితారెడ్డి, ఉపాధ్యక్షులుగా శోభన్‌బాబు, ప్రధాన కార్యదర్శి గా గంగాధర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాప్రా : జన విజ్ఞాన వేదిక కాప్రా మండల మహాసభలు ఆదివారం జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యాలయం కుషాయిగూడలో ఘనంగా జరి గాయి. మహాసభలకు 45 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా కాప్రా మండల ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు మూడేం డ్లుగా జరిగిన కార్యక్రమల నివేదికను ప్రవేశ పెట్టగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదిం చారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక కాప్రా మండల కమిటీ మేడ్చల్ జిల్లాలోని మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. జన విజ్ఞాన వేదిక నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో అనేక మంచి కార్యక్రమాలను చేపడుతు న్నారని తెలిపారు. అనంతరం నూతన కమిటీని మహాసభకు హాజరైన ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. గౌరవ అధ్యక్షులుగా సోమయ్య చారి, దుర్గాచారి, అధ్యక్షులుగా జంగయ్య, ఉపాధ్య క్షులుగా ప్రభాకర్, నాగేశ్వరరావు, శివశంకర్ రెడ్డి, మాల్యాద్రి, ప్రధాన కార్యదర్శిగా వెంకటరమణ, సహాయ కార్యదర్శులు పిట్టల నాగరాజు, కృష్ణమాచార్యులు, నవ్య, హరీష్ , కోశాధికారిగా గురుబ్రహ్మరెడ్డి, కమిటీ సభ్యులుగా బుచ్చిరెడ్డి, వెంకయ్య, అనిల్, సురేష్, సురేందర్ రెడ్డి, శ్రీధర్ కుమార్‌ను ఎన్నుకున్నారు.
మల్కాజిగిరి : మల్కాజిగిరి మండల కమిటీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో అనేక సృజనాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం మల్కాజిగిరి మండలం మహాసభలు జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యాలయంలో ఘనం గా జరిగాయి. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా ఎం.శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. అనంతరం మహాసభకు హాజరైన ప్రతినిధుల ద్వారా ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎండీ ఆండాలి, రామ్మోహన్రావు, అధ్యక్షుడిగా నర్సింహారావు, ఉపాధ్యక్షులుగా పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా శివప్రసాద్, కోశాధికారిగా రవిని ఎన్నుకున్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : జనవిజ్ఞాన వేదిక కీసర మండల అధ్యక్షుడిగా పటేల్ నర్సింహ్మ ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. జన విజ్ఞాన వేదిక మల్కా జిగిరి మేడ్చల్ జిల్లా లోని కీసర మండల మహా సభలు ఆదివారం జన విజ్ఞాన వేదిక జిల్లా కా ర్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ మహా సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక కీసర మండల కమిటీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో అనేక సృజనాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అనంతరం నూతన కమిటీని మహాసభకు హాజరైన ప్రతిని ధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కీసర మండల ఉపాధ్యక్షులుగా సి.ఎన్. శేషు, రమణా రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎం.ఎల్. చౌదరి, సంయుక్త కార్యదర్శిగా సురేష్, కోశాధికారిగా శ్రవణ్ కుమార్ మండల కమిటీ సభ్యులుగా రాజన్ సింగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.