Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎల్అండ్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్ఎంఆర్ హెచ్ఎల్) అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఆర్సీఐ (పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ఎక్స్లెన్స్ అవార్డులు దక్కాయి. 2021 సంవత్సరానికిగాను ప్లాటినమ్ అవార్డును సోషల్ మీడియాను అత్యుత్తమంగా వినియోగించుకున్నందుకుగాను, బ్రాంజ్ అవార్డును అత్యుత్తమ సమాచారం కరోనా సమయంలో అందించినం దుకుగాను దక్కించుకుంది. గోవాలో నిర్వహించిన 15వ అంతర్జాతీయ కమ్యూనికేషన్ కాంక్లేవ్ వద్ద ఈ అవార్డులను అందజేయగా.. గోవా ప్రభుత్వ సాంస్కృతిక శాఖమంత్రి గోవింద్ గౌడే చేతుల మీదుగా ఈ అవార్డులను ఎటీఎంఆర్హెచ్ఎల్ కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ అనిందితా సిన్హా అందుకున్నారు. ఈ సందర్భంగా ఎల్అండ్టీ మెట్రో సీఎండీ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీఐ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవా ర్డులను అందుకోవడం పట్ల సంతోషంగా ఉన్నామని తెలి పారు. తమ వరకు సోషల్ మీడియా అంటే తమ వినియో గదారులతో నేరుగా కనెక్ట్ అయ్యే అత్యుత్తమ మార్గం అని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ వినియోగ దారుల అంచనాలకు మించి సేవలందించడం.. తమ ఈ ప్రయత్నాలకు ఈ అవార్డులు చక్కటి గుర్తింపు అన్నారు.