Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
బస్తీల్లో పోలీసులు చేపట్టే భద్రతపై సీపీ అంజనీకుమార్ పర్యవేక్షించారు. గురువారం బేగంపేట్‌లోని ఇందిరమ్మ, లంక బస్తీతోపాలు రసూల్‌పురా ప్రాంతాల్లో పర్యటించారు. మూడు బస్తీల్లో 6 వేల కుటుంబాలుండగా, దాదాపు 25 వేల మంది జీవిస్తున్నారు. దీంతో ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుం టున్నారు, గుట్టుచప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలా పాలు ఏమైనా కొనసాగుతున్నాయా? అనే అనుమానంతో సీపీనే స్వయం గా ఇక్కడ పర్యటించారు. భద్రత విషయంలో బస్తీవాసు లను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల చదువులు, స్కూల్ వివరాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల పనితీరుపై బస్తీ వాసులు సంతృప్తిని వ్యక్తం చేశారు. వరదలు వచ్చిన సమయంలో బేగంపేట్ పోలీసులు ఆదుకున్నారని, సహాయక చర్యలు తీసుకున్నారని సీపీ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే బేగంపేట్ ఎస్‌హెచ్‌వో పి.శ్రీనివాస్‌రావును సీపీ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించారు. ఈ సందర్భంగా సీపీ వారితో మాట్లాడారు. పిల్లల విషయంతో జాగ్రత్తలు తీసుకోవాలని, వారినిబాగా చదివించాలని పేరెంట్స్‌కు సూచించారు. 'సింగరేణి కాలనీలో ఘటన' ప్రస్తావిస్తూ అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులపట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. యువత చెడుమార్గం పట్టకుండా, వ్యసనాలకు లోనుకాకుండా చూడాలన్నారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగే విధంగా ప్రవర్తిస్తే వారి జీవితాలు పాడవుతాయని తెలిపారు. మాదకద్రవ్యాలు, గంజాయి, సిగరేట్ లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వివిధ అంశాలపై బస్తీవాసులకు సీపీ అవగాహన కల్పించారు. నేరుగా ఇండ్లలోకి వెళ్లిన సీపీ పలువురిని పలక రించారు. ఈ కార్యక్రమంలో నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్, బేగంపేట్ ఏసీపీ నరేష్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో పి.శ్రీనివాస్‌రావు, సెక్టార్ ఎస్ఐ పి.ప్రమోద్‌కుమార్ రెడ్డి, బి.శ్రీనివాసులు తదితరులున్నారు.