Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
దేవాలయాల అభివద్ధికి కషి చేస్తున్న అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తూ దేవాదాయ శాఖను అప్రతిష్టపాలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని దేవాదాయ అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కన్వీనర్ పరశురామ్ రవీంద్ర చార్యులు, కార్యనిర్వాహక అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, ప్రధాన కార్యదర్శి మాదారం యాదగిరి, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాండూరి కష్ణమాచారి డిమాండ్ చేశారు. శుక్రవారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయాల అభివద్ధికి, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు నిరంతర సేవలందిస్తున్న దేవాదాయ సహాయ కమిషనర్ జి అన్నపూర్ణపై కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవాదాయశాఖ కీర్తిని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. దేవాదాయ శాఖ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. దేవాలయాలోఅవినీతి ప్రక్షాళనకు పూనుకొని, నూతన విధానంలో పూజా కార్యక్రమాలు చేపడుతున్న విధానాన్ని జీర్ణించుకోలేక కొందరు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పత్రికలకు పంపించి దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం పరిపాలన విభాగంలోని విలువైన సమాచారాన్ని ఇతరులకు అందించి దేవాదాయశాఖ ప్రతిష్టను మంటకలుపుతున్నారని మండిపడ్డారు. ఉజ్జయిని మహంకాళి ఆలయ ఈవో పై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ ను కోరారు. సహాయ కమిషనర్ అన్నపూర్ణ పై జరిగిన దుష్ప్రచారానికి పాల్పడిన ఈ విషయం పై విచారణ జరిపించి నిజాలు వెలికి తీసి అందుకు పాల్పడినవారిని. సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.