Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
పాతబస్తీ మీరాలం ఫిల్టర్ సబ్ స్టేషన్ సమీపంలో ఉన్న 1570 గజాల స్థలాన్ని దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వాటర్ వర్క్స్ జీఎం రామకష్ణ, స్థానిక కార్పొరేటర్లు ఖాదర్, మోబీన్, మహ్మద్ సలీంలతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఇరుకుగా ఉన్న కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌ను విశాలమైన ప్రదేశంలోకి మార్చడంలో భాగంగా మీరాలం ఫిల్టర్ సబ్ స్టేషన్లో ఉన్న స్థలాన్ని నూతన పోలీస్ స్టేషన్ కోసం కాలాపత్తర్ ఇన్స్పెక్టర్ సుదర్శన్‌తో కలిసి పరిశీలించారు.