Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూలో గత కొన్నేండ్లుగా దాదాపు 300 మంది సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు కేవలం రూ. 1500 నెల జీతంతో దాదాపు 20 ఏండ్లుగా ఉస్మానియా యూనివర్సిటీకి తమ సేవలను అందిస్తున్నారు. మూడేండ్ల ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ పోరాట ఫలితంగా వారి జీతం 4వేలు నుంచి రూ. 6వేలకు పెంచారు. కాగా యూనివర్సిటీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకాఏకీనా 300 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఎక్స్ ఆర్మీని నియమించారు. ఇదే విషయంపై రాష్ట్ర కార్యదర్శి వీఎస్ బోస్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎం.నరసింహ, ఏఐఎస్ఎఫ్ నాయకులు స్టాలిన్, గ్యార నరేష్, కంపల్లి శ్రీనివాస్ ఓయూ కార్మికులు మల్లేష్, పరమేష్, సురేష్, స్వామి, చారి తదితరులు ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీ నారాయణ ను కలిసి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోని, వారికి న్యాయం చేయాలని కోరారు.