Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
ఆర్కేపురం డివిజన్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సర్వీస్ రోడ్డు గ్రీన్ హిల్స్ కాలనీ సమీపం వద్ద గత కొన్ని రోజులుగా డ్రయినేజీ పొంగి పొర్లుడుతుంది అని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలి అని డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ కోరారు. శుక్రవారం నగేష్, మాజీ అధ్యక్షులు మురకుంట్ల అరవింద్ శర్మ మున్సిపల్ అధికారులు, జలమండలి అధికారులతో మాట్లాడి ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్త పైప్ లైను ఏర్పాటుకు ప్రతిపాదన అంచనా త్వరగా పంపాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సాజీద్, కంచర్ల శేఖర్, రామాచారి, లింగ స్వామి, దుబ్బాక శేఖర్, ఫరీద్ పాషా, భూపాల్ రెడ్డి, ఎల్లన్న, జగన్ మోహన్ రెడ్డి, వెంకటేష్, జగన్, శ్రీనివాస్, దేవేందర్, శేఖర్, సోషల్ మీడియా ఇన్చార్జి చోటు పాల్గొన్నారు.