Authorization
Tue April 15, 2025 12:32:28 am
నవతెలంగాణ-అడిక్మెట్
బీసీల బంధు పథకం వెంటనే ప్రవేశపెట్టాలని బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్కా కష్ణ డిమాండ్ చేశారు విద్యానగర్ బీసీ సేన కార్యాలయంలో బీసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కష్ణయ్య, బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కష్ణ యాదవ్ హాజరై మాట్లాడుతూ బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యకమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ కో అర్దినెటర్ డా. ఆర్.అరుణ్ కుమార్, ఎర్ర సత్యనారాయణ, పగిదాల సుధాకర్, చంటి ముదిరాజ్, సుచిత్ కుమార్, సంగీత యాదవ్, మనికంట గౌడ్, తదితరులు పాల్గొన్నారు.