Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
బంజారాహిల్స్‌లోని జీవీకే మహల్ కూడలి వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ మండల టాస్క్ ఫోర్స్, పంజాగుట్ట పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి నాలుగు గ్రాముల కొకైన్, హోండా యాక్టీవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2014లో స్టూడెంట్ వీసాపై హైదరాబాద్‌కి వచ్చిన నైజీరియన్ డానియల్ ఒలేరియా జోసఫ్, కూకట్‌పల్లిలో వివేకనంద కళాశాలలో చదువుతున్న సమయంలో దిల్లీకి చెందిన నైజీరియన్ జాన్ పాల్‌తో కలిసి జోసఫ్ మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో జోసఫ్‌ను లంగర్‌హౌస్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. బెయిల్‌పై విడుదలైన జోసఫ్ మళ్ళీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.గ్రాము కొకైన్ రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు జాన్ పాల్ కోసం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర,బందం నాగేంద్ర,శ్రీశైలం,తకుద్ధ్యన్, చంద్రమోహన్, పంజాగుట్ట పోలీసు అధికారులు తప్పించుకున్న జాన్ పోల్ (37) కోసం గాలిస్తున్నారు.