Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
పెరిక కులస్తులు విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివద్ధి చెందాలని పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగయ్య కోరారు. శనివారం తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం, పెరిక కుల కో-ఆపరేటివ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో 21వ ప్రపంచ పెరిక కుల ఉచిత వధూవరుల వివాహ పరిచయ వేదికను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈసందర్భంగా సుమారు 18 జంటలకు వివాహం కుదిరింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మద్ద లింగయ్య మాట్లాడుతూ ఈ పరిచయ వేదిక లో రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు మహారాష్ట్ర కర్ణాటక ఒడిశా తదితర రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో స్థిరపడిన పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు శ్రీ రామ్ దయానంద్, వేదిక కన్వీనర్ మంక మా నందు సలహాదారులు ఉష అన్న ప్రధాన కార్యదర్శి విజరు కుమార్ నరేష్ శ్రీకర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.