Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూసారాన్ని పెంచడంతో రైతుకు, భూమికి, మొక్కకు మేలు
బాధ్యతాయుత వ్యవసాయానికి పెద్దపీట
మిత్ర పురుగులు, మేలుచేసే సూక్ష్మజీవుల వద్ధి
మూడు ఉత్పత్తులను ఆవిష్కరించిన ఫార్మోవా
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆధునిక యుగంలో మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి అన్నీ విషపూరితంగా మారిపోతున్నాయి. గాలిని ఫిల్టర్ చేయడానికి మాస్కులు కొంత ఉపయోగపడుతున్నాయి. నీటిని కూడా శుభ్రం చేసుకోగలం. కానీ మనం రోజూ తినే కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, ఇతర పంటల్లో రసాయన ఎరువులు, పురుగుమందుల అవశేషాలు లెక్కలేనన్ని ఉంటాయి. వాటిని ఎంత శుభ్రం చేసినా ప్రయోజనం ఉండదు. అందుకే ఇప్పుడు అందరూ సేంద్రియ ఉత్పత్తులవైపు మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల రైతుకు, వినియోగదారుడికి, పంటకు, భూమికి, ప్రభుత్వానికి, చివరకు పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది. సేంద్రియ సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఫార్మోవా సంస్థ మూడు రకాల సేంద్రియ ఎరువులను అందిస్తోంది. త్వరలో మరో 15 రకాల ఉత్పత్తులను అందించనున్నట్టు సంస్థ ఫార్మోవా ఫెర్టిలైజర్స్ ఛైర్మన్ మూలగుండం శివరామకష్ణ, డైరెక్టర్ మాడపాతి భువన్, సీఈవో కురుడి సునీల్ తెలిపారు. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన డీలర్ల సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 600 మంది వరకు వచ్చారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం రైతులు, డీలర్లలో ఫార్మోవా ఫెర్టిలైజర్స్ వారి సేంద్రియ ఎరువులపై అవగాహన పెరగడంతో ఉత్పత్తుల అమ్మకాలు అత్యధికంగా పెరిగాయని ఈ సంస్థ పేర్కొంది.
సేంద్రియ ఎరువుల ప్రయోజనాలు ఇవీ..
మన దేశంలో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతోంది. ఒక్క విశాఖపట్నం మన్యంలోనే ఇది 1-2శాతం ఉంది. మిగిలిన అన్నిచోట్లా 0.5, 0.45శాతం ఇలా ఉంది. దీనివల్ల పంటల ఉత్పాదకత గణనీయంగా పడిపోయి, దానికోసం రసాయన ఎరువుల వాడకం పెరుగుతోంది. ఇలా వాడితే రాబోయే 15-20 ఏండ్లలో మన భూములు వ్యవసాయానికి పనికిరావు. ఇది మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం లాంటిది. భూసార పరీక్షలు చేసి, భూమిలో ఏవేం పోషకాలు కావాలో తెలుసుకునే అలవాటు మన దగ్గర లేదు. అందుకే విచ్చలవిడిగా రసాయన ఎరువులు చల్లేస్తున్నారు. అవి వ్యాధులను ఆకర్షిస్తాయి. అదే సేంద్రియ ఎరువులైతే వ్యాధులను నియంత్రించి, మొక్కలకు ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను అందిస్తాయి. దీనివల్ల కూరగాయలు, ఇతర పంటల బరువు, నాణ్యత, రంగు, ఆకర్షణ అన్నీ బాగుండి మంచి ధర వస్తుంది. సాధారణ టమోటా 30 రూపాయలు కిలో అయితే సేంద్రియ టమోటా 100 రూపాయలు అమ్ముకోవచ్చు. వ్యాధులు లేకపోవడంతో పురుగుమందుల వాడకం కూడా అవసరం ఉండదు. గుంటూరు ప్రాంతంలో విల్ట్ అనే వైరస్ వచ్చి పంట మొత్తం నష్టం అవుతుంది. అదే ఆర్గానిక్ వ్యవసాయం అయితే విల్ట్ని 70-80శాతం అరికట్టవచ్చు.