Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
ఈనెల 4న లేబర్ ఆఫీస్ ఎదుట జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ చాంద్రాయణగుట్ట జోన్ కార్యదర్శి ఎస్. కిషన్, వి. రాంకుమార్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం చాంద్రాయణగుట్టట చౌరస్తా ఫ్లైఓవర్ వద్ద గోడ పత్రిక విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. స్కీంవర్కర్లకు డబ్బులు పెంచాలని, అదేవిధంగా అడ్డాలపై సౌకర్యాలు కల్పించాలని అన్నారు. హైదరాబాద్లో ఉన్న అన్ని అడ్డా లపై ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఇన్సూరెన్స్ కార్డులు జారీ చేయాలని కోరుతూ జరిగే ధర్నాను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జోన్ నాయకులు ఫిరోజ్, అహమాద్, హనుమంతు, చపాల నర్సింహా, నాగరాజు, అలీ, దిలీప్, గహౌస్ తదితరులు పాల్గొన్నారు.