Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిటైర్డ్ ప్రొ. అడప సత్యనారాయణ
నవతెలంగాణ-ఓయూ
చరిత్ర సంరక్షణ కోసం అధ్యాపకులు, విద్యార్థులు, చరిత్రకారులు సమష్టిగా ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిటైర్డ్ ప్రొ.అడప సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల రోస్ మాసూద్ హాల్లో చరిత్ర పరిరక్షణ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రొ.అర్జున్రావ్ కుతాడి సభా అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం చరిత్ర పట్లా చిన్నచూపు చూపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. చరిత్రను నూతన తరహాలో ఈతరం విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేలా బోధించాలని సూచించారు. వివిధ వ్యాసాలు రాసిన చరిత్ర వాస్తవాలు దాని ప్రాముఖ్యతను సీఎం కేసీఆర్ దష్టికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చరిత్ర పరిధిని విస్తతం చేయాలని కోరారు. చరిత్ర శాఖ వైభవం తీసుకువచ్చేందుకు ప్రొ. అర్జున్ రావు నాయకత్వం వహించాలని కోరారు. ఓయూ చరిత్ర శాఖ హెడ్ ప్రొ.అర్జున్ రావ్ కుతాడి మాట్లాడుతూ చరిత్రను పరిరక్షిస్తే అది మనకు ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. చరిత్ర పరిరక్షణ సమితి కాకుండా తెలంగాణ చరిత్ర పరిరక్షణ సమితిగా నామకరణం చేయాలని సూచించారు. అన్ని ప్రొపెషనల్ కోర్సుల్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, కస్తూర్బా, ఇంజినీరింగ్, కళాశాలలో చరిత్ర సబ్జెక్టు ను ఒక ఆప్షనల్‌గా విధిగా ప్రవేశపెట్టలని కోరారు. కార్యక్రమంలో మాజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మెన్, ఔట ఉపాధ్యక్షులు డా.లావణ్య, రిటైర్డ్ ప్రొ. రామకష్ణ, డా.అంజయ్య, చరిత్ర పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు డా.ఎస్.తిరుపతి, డా.పి.తిరుపతి, మల్లేష్, చంద్ర, కుందరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.