Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
సెల్ఫోన్లో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించడంతో క్షణికావేశంతో ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలాపూర్‌కు చెందిన వెల్దుర్తి రామ్మోహన్ చారి, లావణ్య దంపతులు పదేండ్లుగా మీర్పేట్లోని న్యూ సర్వోదయ నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు కౌశిక(17) ఇంటర్ సెకండియర్ చదువుతుంది. ఆదివారం రాత్రి మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చింది. రాత్రి అయిన ఇంకా ఫోన్లో ఏం గేమ్స్ అడుతున్నావు పడుకో అని తండ్రి మందలించాడు. దీంతో బెడ్ రూంలోకి వెళ్లి తలుపు పెట్టుకొని చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్ రెడ్డి, బద్యా నాయక్ తెలిపారు.