Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రకృతి వ్యవసాయం స్ఫూర్తితో ఊరూరా జరుపుతున్న బహుజన బతుకమ్మకు బాసటగా నిలవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బహుజన బతుకమ్మ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయక సంక్షోభం, కరోనా నేపథ్యంలో బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని ప్రకృతి వ్యవసాయం రక్షణ ఫలసాయం అంటూ జరుపుకుందామని పిలుపునిచ్చారు. బతుకమ్మ తొమ్మిది రోజులు మాత్రమే జరిగే ప్రోగ్రాం కాదని ప్రజల సురక్షిత ఆరోగ్యం లక్ష్యంగా నిరంతరం సాధించే ఉద్యమ కార్యక్రమం అని భావిస్తున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజలు ఊరూరా వాడవాడలా ఇదే స్ఫూర్తితో బతుకమ్మను జరుపుకుంటూ ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కొల్లాపురం విమల, లక్ష్మి, పోతుల రమేష్, రవికుమార్, ఏ పూరి నాగిరెడ్డి, అనిత పాల్గొన్నారు.