Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
మద్యం అమ్మకాలను నియంత్రించి బాలికలు, మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న లైంగికదాడులు, హింసను అరికట్టాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.అరుణజ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతను పెడమార్గం పట్టిస్తూ మహిళలపై హింసకు కారణమవుతున్న మద్యాన్ని తక్షణమే నియంత్రించాలన్నారు. మద్యం, మాదక ద్రవ్యాలు, అశ్లీలవెబ్సైట్లతో యువత చెడిపోతుందని, అత్యధిక లైంగికదాడుల కేసుల్లో మద్యం సేవించినట్టు తేలుతోందని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ.పద్మ, కె. నాగలక్ష్మి, నాయకులు షబానబేగం, పి.శశికళ పాల్గొన్నారు.