Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సరూర్‌నగర్
హైకోర్టు ఇచ్చిన తీర్పును మార్కెటింగ్ శాఖ అధికారులు బేఖాతరు చేస్తున్నారు అని, కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ధిక్కరిస్తే మా గోడు ఎవరికి చెప్పుకోవాలి అని గడ్డిఅన్నారం మార్కెట్ జేఏసీ కన్వీనర్ అశోక్ కుమార్ అన్నారు. గడ్డిఅన్నారం మార్కెట్‌కు తాళాలు వేసి ఉండడంతో బుధవారం ఎన్టీఆర్ నగర్ మార్కెట్ అధికారులకు కోర్టు ఆర్డర్ కాపీని ఇవ్వడం కోసం వచ్చినా అధికారులు ఎవరు లేరు అని కార్యాలయాలకు తాళాలు వేసి ఉన్నాయి అన్నారు. ఆయన మాట్లాడుతూ న్యాయస్థానం ఆదేశించినా మార్కెట్ తెరవడంలేదు అన్నారు. రెండు మార్కెట్లలో ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరు అని, అధికారులకు ఫోన్లు చేస్తే ఎవరూ స్పందించడంలేదు అన్నారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేశాం అని తెలిపారు. డీసీపీ, ఏసీపీలను కలిసి సమస్య వివరించాము అన్నారు. మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్వాకం కారణంగానే గడ్డిఅన్నారం మార్కెట్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారయింది అని ఆరోపించారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని పట్టుకొని మార్కెటింగ్ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఒక్కరు కూడా అందుబాటులోలేరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తాజుద్దీన్, శ్రీనివాస్, అప్సర్ తదితరులు పాల్గొన్నారు.