Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంగళ్‌హాట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్
నవతెలంగాణ - ధూల్‌పేట్
డివిజన్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి పార్టీ పదవులను ఏర్పాటు చేశామని మంగళ్‌హాట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు డివిజన్లోని మొత్తం 45 బస్తీ, కాలనీ కమిటీలు ఏర్పాటు చేశారు. గోషామహల్ నియోజకవర్గం ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో డివిజన్ మెయిన్ కమిటీ, మహిళా కమిటీ, యూత్ కమిటీ, ఎస్సీ కమిటీ, బీసీి కమిటీ, మైనారిటీ కమిటీ, ట్రేడ్ సెల్, కార్మికులు, సోషల్ మీడియా కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్లో ప్రజల్లోకి ప్రజా సంక్షేమ పథకాలను తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలే కీలకమన్నారు. 360 మందితో నూతన కమిటీ పదవులను అప్పగించామని, పార్టీని మరింత బలోపేతం చేయడానికి పార్టీ పదవులు ఇవ్వడం జరిగిందన్నారు.
డివిజన్ కమిటీలు..
డివిజన్ కమిటీ అధ్యక్షుడు శశిరాజ్సింగ్, మహిళా కమిటీ ప్రెసిడెంట్ ఆర్. నవనీత,. యూత్ కమిటీ అధ్యక్షుడు బి.అమిత్ కుమార్, ఎస్సీ- సెల్ అధ్యక్షుడు మనోహర్ గైక్వాడ్, కార్మికులు సెల్ అధ్యక్షుడు ఎ.రాజు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ ఫహీమ్, ప్రధాన కార్యదర్శి అహ్మద్,. బీసి సెల్ అధ్యక్షుడు విష్ణుమూర్తి, ట్రేడ్ సెల్ అధ్యక్షుడు జుమాన్ సింగ్, సోషల్ మీడియా కమిటీ అధ్యక్షుడు ఎం. దినేష్, ప్రధాన కార్యదర్శి తులజారామ్ సింగ్ ఉన్నారు.