Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్వేషపూరిత పోస్టులకు బాధ్యత మీదే
- వాట్సప్ గ్రూపులో జాగ్రత్తగా వ్యవహరించకుంటే కేసులు తప్పవు
- సమన్వయం చేయకపోతే చిక్కులు
నవతెలంగాణ-బోడుప్పల్
మీరు ఏదైనా వాట్సప్ గ్రూప్‌నకు అడ్మిన్‌గా ఉన్నారా? సదరు గ్రూప్‌లో మీకు తెలియకుండా గ్రూప్ సభ్యుడు ఏదైన వివాదాస్పదమైన అంశం పోస్ట్ చేశాడా..? ఇప్పుడు పోస్ట్ చేసిన వ్యక్తితో పాటు గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న మీపై కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందని ఐటీ చట్టం చెప్తోంది. ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమం విస్తతంగా వ్యాప్తి చెందింది. ప్రస్తుత కాలంలో ఏ విషయమైనా తొందరగా వ్యాప్తి చెందాలంటే ఏకైక మార్గం వాట్సప్ ఒక్కటే. డిజిటల్ మీడియా బాగా ప్రాచుర్యం పొందిన అనంతరం వివిధ రకాల ప్రకటనలు ఇతర సమాచారం కోసం కాలనీ అసోసియేషన్ల నుండి మొదలు ఆఫీసులు, ప్రెస్, పోలీసు, పొలిటికల్, స్కూల్, రాజకీయ నాయకులు ఇలా ఒక్కరేమిటి అన్ని వర్గాల వారు గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని సమాచారం పంచుకోవడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఎక్కడో ఎప్పుడో జరిగిన విషయాలను కుడా ఇష్టం వచ్చినట్లు గ్రూప్‌లో పోస్ట్ చేయడం అనర్థాలకు దారితీస్తున్నది. తత్ఫలితంగా అదే గ్రూప్‌లో ఉన్న వేరే వ్యక్తుల మనోభావాలకు అంతరాయం కలిగే అవకాశాలు అనేకసార్లు ఉత్పన్నం అవుతున్నాయి. ఇదే విషయాలలో అనేకసార్లు దాడులు, ప్రతిదాడుల వరకు వెళ్ళిన సందర్భాలున్నాయి.
గ్రూప్ అడ్మిన్లకు బాధ్యత ఉందా?
వివిధ గ్రూప్‌లలో ఇష్టానుసారంగా చేసే పోస్ట్‌లపై పోస్ట్ చేసిన వ్యక్తితో పాటు సదరు గ్రూప్ అడ్మిన్‌కు కూడా బాధ్యత ఉంటుంది. కొన్నిసార్లు గ్రూప్‌లో పోస్ట్ చేసే సమాచారం కొన్ని వర్గాల మధ్య విద్వేేషాలను రెచ్చగొట్టేలా ఉండడంతో ఇరువర్గాల మధ్య గలాటా జరిగే అవకాశం ఉంది. కావునా గ్రూప్ అడ్మిన్ పోస్ట్ చేసే వ్యక్తులను సమన్వయం చేసేలా భాద్యత వహించాలి. లేదంటే పోస్ట్‌లపై వ్యతిరేక పక్షం వాళ్ళు కేసు పెడితే గ్రూప్ అడ్మిన్‌పై కూడా కేసు నమోదవుతుంది.
రూల్స్‌లో ఏమున్నరు..?
కులమతాలకు ఆపాదించి ఇతరుల మనోభావాలు దెబ్బతీయకూడదు. అనుమతిలేకుండా ఫోటో షేర్, వాయిస్ షేర్ చేయరాదు. వివాదాస్పద వ్యాఖ్యలు నిషేధం. వ్యక్తుల పట్ల హేళన భావం ప్రదర్శించ రాదు. తప్పుడు సమాచారం పోస్ట్ చేయరాదు. ఓ మంచి ఉద్దేశంతో కూడిన చాట్ మాత్రమే గ్రూపులో చేయాలి. లేకపోతే అడ్మిన్‌ను ప్రథమ బాధ్యుడిగా భావించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకు నేందుకు అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్లో 500 నుండి 505 వరకు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా వ్యక్తుల య్నెక్క వ్యక్తిగత పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరిం చడం, కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా పోస్టులు షేర్ చేయడం, అశ్లీల సాహిత్యం, ఫోటోలు షేర్ చేయడం, మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయడం, ఇతరులను కించపరిచేలా పదాలు వాడడం లాంటివి వాట్సప్, ఫెస్ బుక్‌లతో పాటు ఇతర సమాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసినప్పుడు ఐటీ యాక్ట్ 66,67 ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇటీివల కాలంలో మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఓ బహుళ అంతస్తుల భవన నిర్మాణం విషయంలో ఒక వర్గం వారు తప్పుడు సమాచారం ఇచ్చారని సదరు నిర్మాణ సంస్థ వాళ్ళు ఫిర్యాదు చేయడంతో పోస్ట్ చేసిన వారిపై కేసులు నమోదు చేయాడం జరిగింది.