Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కురుమ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి
నవతెలంగాణ-ఉప్పల్
తెలంగాణ రాష్ట్రంలో 50లక్షల జనాభా గల కురుమలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, రూ.5000 కోట్లతో కురుమ ఫెడరేషన్ ఏర్పాటు చేసి, ఉపాధి కల్పించాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు గొరిగే రమేష్ కురుమ, కోసిక శ్రీనివాస్ కురుమ, రాష్ట్ర కురుమ కార్యదర్శి గొరిగే మల్లేష్ కురుమ బీజేపీ రాష్ట్ర నాయకులు గోరియ కష్ణలు డిమాండ్ చేశారు. బుధవారం ఉప్పల్ నియోజకవర్గ కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జోన్ కురుమ సంఘం ప్రెసిడెంట్ రేవు కష్ణ కురుమ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50లక్షల జనాభా ఉన్నా రాజకీయ ప్రాధాన్యత కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కురుమల జనాభా 50 లక్షలు ఉన్నా ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాజ్యాధికారం కోసం కురుమలు సంఘటితం అయి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. కురుమలకు ఉపాధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే వైన్స్ షాపులలో గౌడ్లకు కేటాయించినట్లుగా.. మటన్ మార్కెట్లలో 50 శాతం వాటా కల్పించాలని కోరారు. అలాగే దొడ్డి కొమురయ్య కురుమ, పద్మశ్రీ చుక్క సత్తయ్య కురుమ విగ్రహాలను ట్యాంక్‌బండ్ పైన ప్రతిష్ఠించడంతోపాటు వారి జయంతి, వర్థంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో కురుమలకు ప్రాధాన్యత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఉప్పల్ డివిజన్ కురుమ సంఘం అధ్యక్షులు చిందం వెంకటేష్ కురుమ, ఉప్పల్ కురుమ సంఘం అధ్యక్షులు, గొరిగే ఐలయ్య కురుమ, మహిళ కమిటీ అధ్యక్షులు సోము బాలమణి కురుమ, మహిళా అధ్యక్షురాలు బండారి మంజుల కురుమ, ప్రధానకార్యదర్శి పాట రాజశ్రీ కురుమ, ఉప్పల్ కురుమ సంఘం మాజీ అధ్యక్షుడు బత్కరి బీరప్ప కురుమ, వెలుగుగుట్ట డైరెక్టర్ కొండ్రు హనుమంతు, మోటే నర్సింహాకురుమ, కొలు ఐలయ్య కురుమ, మహిళా సోదరీ మణులు తదితరులు పాల్గొన్నారు. కురుమల ఇంటింటింకీ వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని సమస్యలను పరిష్కరించే విధంగా కషి చేస్తాము. కురుమల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు.