Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుక్కెడు నీటికోసం తప్పని తిప్పలు
నవతెలంగాణ-ఉప్పల్
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తాగడానికి గుక్కెడు మంచినీరు కరువైందని కలుషిత నీటితో అవస్థలు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, అధికారులు స్పందించడం లేదంటూ రామంతాపూర్‌లోని రామ్ శంకర్‌నగర్ కాలనీవాసులు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కలుషిత నీటిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు ఎర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా రామ్ శంకర్‌నగర్‌లో కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ప్రజలు వాపోతున్నారని ఆయన పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీి సర్కిల్ నందు, రామంతపూర్ రామ్ శంకర్ నగర్‌లోని స్ట్రీట్ నెం.5లో గత ఆరు నెలలుగా తాగు నీటిలో డ్రయినేజీ వాటర్ కలసి కలుషిత నీరు సరఫరా అవుతుందని అధికారులకు, పాలకులకు చెప్పినప్పటికీ నామమాత్రంగా పరిష్కారం చేసి వెళ్ళిపోతున్నారు. ఈ సమస్యతో కాలనీవాసులు, చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడి హాస్పిటల్లకు లక్షల రూపాయలు చెల్లించవలసివస్తుందని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని కాలనీవాసులు మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేనిచో కాలనీవాసులతో కలసి జలమండలి ఆఫీస్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో రామ్ శంకర్ నగర్ గణేష్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పద్మ, లక్ష్మి,విజరు కుమార్, అధ్యక్షులు ధర్మారెడ్డి, రఘునాథ్, రామలింగేశ్వర, అరవింద్ రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.