Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
లింగోజిగూడ డివిజన్ పరిధిలోని తపోవన్ కాలనీ రోడ్ నెం.1లో అక్రమంగా నిర్మించిన భారీ భవనంపై చర్యలు తీసుకోవాలని బుధవారం కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భవనం ముందు ఆందోళన చేశారు. అనంతరం కాలనీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో అధికారులు కూల్చివేతలు చేపట్టి పనులు నిలిపివేశారని గుర్తుచేశారు. తిరిగి భవనం నిర్మాణం చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 1100 గజాలలో ఎలాంటి అనుమతులు లేకుండా భవనం నిర్మించారని తెలిపారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ భవనంలో హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని, ఇప్పటికే కాలనీలో డ్రయినేజ్, నీటి సమస్యలతో బాధపడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేస్తే మరింత ఇబ్బంది పడాల్సివస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు ఎంజివి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బి.రాజు, ఉపాధ్యక్షులు శివ, నాయకులు కష్ణమోహన్, కష్ణ, ఐలయ్య, బాలరాజు, రాజేష్, శ్రీకాంత్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.