Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కీ.శే హనుమానాయక్ ప్యాంటీ బాయి ఆరవ సంతానమైన కేతావత్ లక్ పతి నాయక్ గ్రంథాలయ శాస్త్రంలో 'ఏ స్టడీ ఆన్ యూజ్ పాటర్న్ అండ్ ఇంపాక్ట్ అఫ్ ఈ రిసోర్సెస్ బై ఫ్యాకల్టీ మెంబర్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ' అనే అంశంపై డాక్టర్ వివేక్ వర్ధన్ పర్యవేక్షణలో పరిశోధన గ్రంథం సమర్పించారు. దీంతో కేతావత్ లక్ పతి నాయక్ కు డాక్టరేట్ ప్రధానం చేశారు. లక్పతి నాయక్ గతంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తెలంగాణ ఉద్యమంలో 30 పైగా కేసులను అనుభవించి మలిదశ ఉద్యమంలో వీరోచితంగా పోరాడారు. అర్ధదశాబ్దం పాటు తెలంగాణ గ్రంథాలయ సంఘం సహాయ కార్యదర్శిగా, ఆర్గనైజేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ దేశ్‌కు నాలుగు సంవత్సరాల కాలం పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలందించారు. ప్రస్తుతం ఓయూలో జెనెటిక్స్ విభాగంలో ఒప్పంద గ్రంథపాలకునిగా, పార్ట్ టైం గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకులుగా సేవలందిస్తున్నారు. అర్ధశతాబ్దపు గ్రంథాలయ శాస్త్ర విభాగంలో పీహెచ్డీ పట్టా అందుకున్న రెండవ గిరిజనుడు కావడం విశేషం. గ్రంథాలయ శాస్త్రంలో జాతీయ జర్నల్స్ లలో 25 పరిశోధన పత్రాలు, జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో 15 పరిశోధన పత్రాలు సమర్పించారు. ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ ఆఫ్ లైబ్రరీ మెటీరియల్, స్టేటస్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ ఇన్ తెలంగాణ అనే రెండు పుస్తకాలకు సహ రచయితగా ఉన్నారు .దేవరకొండకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందంపేట మండలం రేగులగడ్డ గ్రామ పరిధిలోని మారుమూల ప్రాంతమైనా యాపల బాయి తండా నుంచి వచ్చి గ్రంథాలయ శాస్త్రంలో పీహెచ్డీ వరకు చేయడం ఆయన నిబద్ధతకు, కఠోర శ్రమకు దక్కిన ఫలితం అని తెలంగాణ గ్రంథాలయ సంఘం ప్రతినిధులు అభినందించారు.