Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
నిరుపేద వృద్ధులు, వికలాంగులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. కవాడిగూడ డివిజన్లో ఎల్చిగూడ బస్తీలో నివాసముండే వద్ద వికలాంగులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ట్రై సైకిల్ అందజేసి చేయూతని చ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు ఇస్తూ ఆదుకుంటుందన్నారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు వివిధ పరికరాలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జైసింహ, డివిజన్ ప్రెసిడెంట్ వల్లాల శ్యామ్ యాదవ్, కార్యదర్శి సాయి కృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వల్లాల శ్రీనివాస్ యాదవ్, జమాలు ద్దీన్, ప్రవీణ్, శ్రీహరి, రజక వేణు, దుర్గ స్వామి, లక్ష్మణ్, శంకర్, ప్రభాకర్, శివసింహ, బాలయ్య, మల్లేష్, బాబురా వు, జావీద్ ఖాన్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.