Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లోని వర్షం ప్రభావిత ప్రాంతాలను ఆదివారం మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పరిశీలించారు. వర్షం ప్రభావంతో ఇబ్బందులు పడిన కాలనీల్లోని ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని వారికి హామీనిచ్చారు. వాటర్ వర్క్స్ మేనేజర్‌తో కలిసి డివిజన్లోని పలు డ్రయినేజీ బాక్సింగ్ స్పాట్స్‌ను కూడా పరిశీలించారు. అవసరమైన చోట్ల వెంటనే క్లీనింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.