Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనేది నాలుగు లక్షల ప్రజల ఆకాంక్ష అని.. విలీనం అంశానికి మద్దతు ఇవ్వాలని కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రతినిధులు ఆదివారం మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్ల మెంటరీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డిని మర్యాద పూర్వ కంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనివ్వడంతో కంటోన్మెంట్ వికాస్ మంచ్ తరపున మంత్రి మల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సన్మానించారు. అనంతరం రాజశేఖర్‌రెడ్డిని కలిసి విలీనం అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ విలీనం అంశంపై పోరాటానికి సైతం సిద్ధమని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డం అబుల్, సంకీ రవిందర్, ప్రభు గుప్తా, ముప్పిడి మధుకర్, అరుణ్ యాదవ్, మహమ్మద్ ఫాసి పాల్గొన్నారు.