Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) బతుకమ్మ సంబురాలు పిల్లి నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో నేరెడ్మెట్ హరిజన బస్తి అంతయ్య కాలనీ, గాంధీన గర్లలో బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వినోద, జిల్లా ఉపాధ్యక్షురాలు బి.మంగ, మాజీ కౌన్సిలర్ చల్లా లీలావతి మాట్లాడుతూ రోజురో జుకూ ఆడపిల్లలపై హత్యలు, లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయనీ, వీటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి అన్నారు. ఆరేండ్ల పాన నుంచి 60 ఏండ్ల ముసలమ్మల వరకు లైంగిక దాడులు జరుగుతున్నాయని తెలిపారు. వీటికి కారణమైన మద్యం, డ్రగ్స్, గంజాయి, అశ్లీల చిత్రాలను వ్యాపారంగా ప్రభు త్వాలు చూస్తున్నాయని తెలిపారు. వీటిని అరికట్టాలని ఐద్వా డిమాండ్ చేస్తుందనీ, కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితిని తీసుకొచ్చిందనీ, అన్నం పెట్టే రైతు పోరాడుతుంటే మూడు నల్ల చట్టాలను రద్దు చేసేది పోయి బీజేపీ ప్రభుత్వం చంపేయడం మొదలు పెట్టిం దన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నాగమణి, అరుణ, రేణుక బి.సునంద, వై.వైష్ణవి, సుమిత్ర, నరసమ్మ, లత, శోభ, ఉమ పాల్గొన్నారు.