Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
బతుకమ్మ పండుగ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, మంజీర రచయితల సంఘం వ్యవస్థాపకులు, ప్రజాకవి డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ద్వారకపురి కాలనీ అక్షర స్కూల్ యజమాన్యం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో నందిని సిధారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బతుకమ్మకు ఆదరణ లేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్రం కావడంతో బతుకమ్మకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపుతున్నారని తెలిపారు. బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి అనేక మంది అమరవీరుల త్యాగ ఫలితమే అన్నారు. రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. రిటైర్డ్ ఎంఈఓ పనియాల వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి బతుకమ్మ వేడుకలు చూస్తే గ్రామాలు గుర్తుకొస్తున్నాయన్నారు. అక్షర స్కూల్ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగడం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్ర మంలో సీనియర్జ ర్నలిస్టు దామరపల్లి నరసింహారెడ్డి, అక్షర స్కూల్ కరస్పాండెంట్ బి.మల్లారెడ్డి, ప్రిన్సిపాల్ అర్చన, ద్వారక పూరి కాలనీ అధ్యక్షుడు గురు, మంచి అశోక్చారి, వై.శంకర్రెడ్డి, నాగశేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గొల్ల సీతామాలక్ష్మి, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.