Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో గల సాహెబ్ నగర్ లోని బతుకమ్మ కుంటలో స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి మరియు జీహెచ్ఎంసీి డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ కలిసి పారిశుధ్య కార్మికులతో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కూడా పారిశుధ్య కార్మికుల తో ఎవరు ఇలాంటి సంబరాలు నిర్వహించలేదని, ఇలా కార్మికులతో మొదటిసారిగా బతుకమ్మ సంబరాలు నిర్వహించినందుకు ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. పారిశుధ్య కార్మికులు అందరు కూడా తప్పనిసరిగా శానిటైజర్, మాస్కులు ధరించాలని పారిశుధ్య కార్మికులు ఆరోగ్యవంతంగా ఉంటేనే డివిజన్లోని ప్రజలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కేసరినగర్ అధ్యక్షులు రవిశంకర్, జీహెచ్ఎంసి ఎస్ఎస్ అజీమ్ ఉద్దీన్, జవాన్ శ్రీనివాస్, ఎస్.ఎఫ్.ఏ గోవర్ధన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మైరాజ్, బాలు పాల్గొన్నారు.