Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న లఖింపూర్ ఖేరి రైతులపై కేంద్ర హోం సహాయ మంత్రి తనయుడు హత్య చేయబడ్డ రైతులను స్మరిస్తూ ఆదివారం రాత్రి ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యం లో ఆర్ట్స్ కళాశాల ముందు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఓయూ కార్యదర్శిలోనే క్రాంతి రాజ్, రహేమన్లు నాయకులు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, దేశ రైతాంగ శ్రమను, సంపదను అంబానీ, ఆదాని అప్పనంగా కట్టబెట్టడానికే నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది అని వారన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం కార్పొరేటు కంపెనీలకు కట్ట బెట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు. దాదాపు సంవత్సరకాలంగా ఢిల్లీ వీధులలో రైతుల పోరాటం చేస్తున్న ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు రైతులు విద్యార్థులు కార్మికులు కర్షకులు సమిష్టిగా పోరాటం చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్ర మంలో ఏఐఎస్ఎఫ్ ఓయూ నాయకులు మధు, భూపతి, రాజు, హేమంత్, అవినాష్‌తో పాటు పాల్గొన్నారు.