Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
వద్ధాప్య పింఛన్ల దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకా శం కల్పించిందని మేడ్చల్ మండల ఎంపీపీ అప్పమ్మగారి పద్మాజగన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ 57 ఏళ్లు నిండిన వారందరికీ సోమవారం నుంచి ఈనెల 31 వరకు దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాస్తవానికి ఆగస్టు 31తో దరఖాస్తు స్వీకరణ గడువు పూర్తయిందని కరోనా, వివిధ కారణాలతో పలువురు దరఖాస్తులు చేసుకోలేకపోయారని ఈ నేపథ్యం లో రెండ్రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో పలువురు శాసనసభ్యులు ఇదే విషయాన్ని సీఏం కేసీఆర్ దష్టికి తీసుకు రావడంతో వద్ధాప్య పింఛన్ల దరఖాస్తుకు మరోసారి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కీసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. అర్హులైన వారు మీ సేవ కేంద్రాలకు వెళ్లి తగు ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. వయసు నిర్థారణకు పంచాయతీ శాఖ, మున్సిపల్ శాఖ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాలు లేదా ఓటరు గుర్తింపు కార్డులో నమోదైన వయసును ఆధారంగా చూపి దరఖాస్తుకు ఆధార్‌కార్డు, వయసు నిర్థారణ పత్రంతో పాటు, బ్యాంకు పాసు పుస్తకం, పాస్‌పోర్టు సైజు ఫోటోతో స్వయంగా దరఖాస్తుదారు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంటుందని అందరు లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.