Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
గోడ కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించిన స్థానికులు కూలిన తర్వాత చూద్దాంలే అన్నట్టు ఎదురు చూసిన అధికారులు. ఇద్దరి మాటలు అక్షరాల నిజమయ్యాయి. అటుగా ప్రయాణికులు ఎవరు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం జరిగింది. గత కొన్ని ఏళ్లుగా అక్రమంగా పార్కింగ్ చేస్తున్న స్థానిక బస్తీవాసుల రెండు కార్లు కుప్పకూలిన గోడ కింద నుజ్జునుజ్జు అయ్యాయి. రెండు కార్లు గతంలో వాడినవే, రెండింటికీ ఇన్సూరెన్స్ లేదు. స్థానికంగా నివసించే వారు గత కొన్ని సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో పార్కింగ్ చేస్తున్నాం గోడకు భారీగా రేఖ వచ్చింది కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపినా ఆర్ అండ్ బి అధికారి కిషన్ తనకేమీ పట్టనట్టు వ్యవహరించారని వారు ఆరోపించారు. బంజారహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ ప్రహరీ గోడ ఆదివారం ఉదయం పదిగంటల నలభై నిమిషాల సమయంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి డిజాస్టర్ రాపిడ్ ఫోర్స్ బంజా రాహిల్స్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, స్థానిక కార్పొరేటర్ మన్నే కవితరెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు తదితరులు హాజరై భారీ కరెంటు స్తంభాలు, వక్షాలను అవసరం లేకుండా నరికివేసి, రహదారిలో అడ్డంగా ఉంచడం వలన ఉదయం నుండి సాయంత్రం వరకు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. భారీ వక్షాలను నేలమట్టం చేసి జేసీబీ సహకారం, వక్షాలను నరికివేసే మిషన్ల సహకారంతో (డి ఆర్ ఎఫ్) టీం రోజంతా కష్టపడి రహదారి రాకపోకలకు కలిగిన ఆటంకం తొలగించడంలో బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తదితరులు కీలకపాత్ర పోషించారు. హెచ్చరికలు జారీ చేసినప్పుడే ఈ పనులు పూర్తిచేసుకుని ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని, ఆర్ అండ్ బి అధికారి కిషన్ ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే తమకు నష్టం జరిగేది కాదని కారు ఓనర్లు ఆదిల్, అలియాస్లు పేర్కొన్నారు. తనకు జరిగిన నష్టానికి మార్గం చూపాలని కార్పొరేటర్లు వేడుకొన్నారు.