Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
హక్కుల సాధన కోసం పాటుపడేవారికి ఎల్లపుడూ తగిన స్థానం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పేర్కొన్నారు. సోమవారం మేడ్చల్ జిల్లా మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమా వేశం జరిగింది. మేడ్చల్ జిల్లా మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అక్కపల్లి ప్రవీణ్, ఉపాధ్యక్షుడుగా గోరంటి ప్రవీణ్‌ను నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీసర మండలం యద్గార్పల్లి, కీసర గ్రామాలకు చెందిన ఇద్దరు సామాజిక, యువ నాయక త్వంలో ప్రావీణ్యులేనని అన్నారు. రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడి నాయకత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే సిద్దాంతాలను ముందుకు తీసుకుపోయే ందుకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కపల్లి ప్రవీణ్, గోరంటి ప్రవీణ్ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు చెప్పాల నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.