Authorization
Tue April 15, 2025 02:16:30 am
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర మండలంలోని ఆయా గ్రామాల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవటంలో అధికారులు విఫలమవుతున్నారని ఎంపీఓ మంగతా యారుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కీసర మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంగతాయారు మాట్లా డుతూ అక్రమ నిర్మాణాలపై తాను చర్యలు తీసుకుంటు న్నాననీ, కార్యదర్శులు సహకరించడం లేదని తెలిపారు. యాద్గార్పల్లి ఎంపీటీసీ జూపల్లి వెంకటేష్ మాట్లాడుతూ ఎక్కడ అక్రమ నిర్మాణాలు తొలగించారో తమకు తెలపా లని కోరగా ఎంపీఓ మంగతాయారు విషయంపై దాట వేశారు. యాద్గార్ పల్లిలోని డబల్ బెడ్రూమ్ ఇండ్లు పేదల కు కేటాయించి ఏడాది దాటినా, ఇంతవరకు విద్యుత్ కనెక్ష న్లు, మంచినీటి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్దిదారులకు ఇప్పటివరకూ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వకపో వడంతో అధికారులు తాము విద్యుత్ మీటర్లు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. రాత్రి పూట విద్యుత్ వైర్లు వేసి విద్యుత్ వాడుతున్న వారిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి కేసులు పెడుతున్నారని వెంకటేష్ సమావేశంలో తెలిపారు. ఇందుకు అధికారులు బాధ్యత వహించాలని నిలదీశారు. ఈ సమస్యను ఇప్పుడే తేల్చాలని పట్టుబట్టారు. తమ పరిధిలో లేదని అధికారులు నచ్చ చెప్పడంతో, జిల్లా స్థాయి అధికారులకు విన్నవిస్తామని అది óకారులు తెలిపారు. గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభలకు అధికారులు హాజరు కాకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేక పోతున్నామని సర్పంచులు వాపోయారు. కీసరగుట్ట పార్కింగ్ వేలం డబ్బులు చెల్లించకుండా సదరు వ్యక్తి ఆలయానికి వచ్చే వాహనదారుల నుంచి పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తున్నాడని వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి పేర్కొన్నారు. డబ్బులు కట్టకుండా వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకో వాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిష్యత్ ఉపాధ్యక్షులు బెస్త వెంకటేష్, మండల వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్ రవీందర్ యాదవ్, పీఏసీఎస్ ఛైర్మన్ రామిడి ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీఓ పద్మావతి, ఎంపీటీసీలు పండుగ కవిత, నారాయణశర్మ, వెంకటేష్, ప్రమీల, వెంక ట్‌రెడ్డి, కిరణ్ జ్యోతి, సర్పంచులు గోపాల్‌రెడ్డి, మహేందర ్రెడ్డి, విమలనాగరాజు, అండాలు, కవిత, పెంట య్య, రాజు, సత్యమ్మ, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.