Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-తుర్కయాంజల్
తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో నిన్న మొన్న కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, నాలాలకు మరమ్మ తులు చేసి కల్వర్టులను నిర్మిస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం ముంపునకు గురైన మునుగానూరు కల్వర్టును పరిశీ లించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుర్క యాంజల్, ఇంజపూర్, తొర్రూర్, పెద్ద అంబర్పేట, మున గనూరు గ్రామాల్లో దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. రహదారులపై నీరు పొంగి పొర్లడంతో హయత్నగర్-మునుగనూరు, పెద్ద అంబర్ పేట- కోహెడ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగిందని తెలిపారు. నియోజకవర్గంలో రూ.34 కోట్ల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మంజూరు కాగానే అత్యధిక ప్రాధాన్యత గల పనులు వెంటనే చేపడతామని హామీ ఇచ్చారు. ధ్వంసమైన ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయిస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా రైతు సమితి అధ్యక్షులు, తుర్కయంజాల్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ వంగేటి లక్ష్మారెడ్డి, మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కళ్యాణ్ నాయక్, తుర్కయాంజల్ మున్సిపాలిటీ టీఅర్ఎస్ అధ్యక్షుడు వేముల అమరెందర్రెడ్డి, కౌన్సిలర్లు తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్త, వేముల స్వాతి, తుర్క యంజాల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు బలదేవ్రెడ్డి, నాయకులు గుండ ధన్రాజ్ పాల్గొన్నారు.