Authorization
Wed April 16, 2025 11:13:03 am
నవతెలంగాణ-బడంగ్‌పేట
మహిళలు అన్ని రంగాల్లో స్వయంశక్తితో ఎదిగి ఆర్థికాభివృద్ధి సాధించాలని బడంగ్పేట్ మున్సి పల్ కార్పొరేషన్ మేయర్ చిగు రింత పారిజాత నర్సింహ్మరెడ్డి అన్నారు. సోమవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో సహౌదరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ఇండిస్తీయల్ స్వివింగ్ మెషిన్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల ఉచిత శిక్షణ కేంద్రాన్ని మేయర్ ప్రారంభించి మాట్లాడారు. మహిళలు, విద్యార్థినులు స్వయం శక్తితో ఎదిగేందుకు ఇలాంటి కోర్స్‌లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇప్పుడు ఉన్న ఆధునిక యుగంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలనీ, ఆర్థికాభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, కార్పొరేటర్లు పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, అరుణ ప్రభాకర్, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు అర్క ల కామేష్ రెడ్డి, నిర్వహకురాలు స్వర్ణలత, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.