Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
24న బెంగళూర్లో జాతీయ సెమినార్
నవతెలంగాణ-అడిక్మెట్
కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసి తీరాల్సిందే సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం అఖిలపక్ష రాజకీయ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరుగబోయే జనగణనలో కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఈనెల 24న బెంగళూరులో జాతీయస్థాయి మేధావుల-ప్రొఫెసర్ల, రాజకీయ నాయకులతో సెమినార్ జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కుల గణన చేయాలని తమ, తమ విధాన ప్రకటన జారీ చేశాయని, కానీ కాంగ్రెస్ తన వైఖరినీ ఇప్పటికీ ప్రకటించలేదన్నారు. బీజేపీ తన బీసీ వ్యతిరేక విధానాన్ని మార్చుకోవాలని, కుల గణన చేపట్టడానికి సుముఖంగా ఉన్నట్లు సుప్రీంకోర్టులో రివైజ్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. సమావేశంలో బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, నీల వెంకటేష్, భూపేష్ సాగర్, సి.రాజేందర్, ఉదరు, అనంతయ్య, పగిళ్ల సతీష్, చంటి ముదిరాజ్, చరణ్ యాదవ్ పాల్గొన్నారు.