Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగర పోలీసుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. పేట్లబుర్జులోని కార్హెడ్క్వార్టర్స్లో వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చారు. పెద్దఎత్తున బతుకమ్మలను ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా అందరిని విశేషంగా ఆకర్షించింది. అదనపు సీపీ షీఖాగోయేల్తోపాటు డీసీపీ(అడ్మిన్) సునీతారెడ్డి, అదనపు డీసీపీ శిరీష తదితరులు బతుకమ్మను ఆడారు. ఈ కార్యక్రమానికి సీపీ అంజనీకుమార్ పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిటీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు ఎన్.శంకర్రెడ్డి తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.