Authorization
Mon April 14, 2025 11:55:33 am
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
పేద ముస్లింల కోసం ప్రభుత్వం వెంటనే మైనార్టీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో వ్యాపారాలు నడవక పేద ముస్లింలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. రాష్ట్రంలో మైనార్టీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేదల ముస్లింలకు రూ. 10 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు డీజీ నరసింహారావు, ఆవాజ్ సిటీ కార్యదర్శి అబ్దుల్ సత్తార్, కార్యదర్శి మహమూద్ అలీ, అజీజ్ అహ్మద్ ఖాన్. బాబర్ ఖాన్. కోటయ్య, నూర్ బేగం, అఫ్జల్, బి. అక్తర్ బేగం తదితరులు పాల్గొన్నారు.