Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్దినగర్లో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో పాటు తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశంగౌడ్, గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రముఖ సంఘ సేవకులు దంపన బోయిన శ్రీనివాస్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.