Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
రాంనగర్ డివిజన్ పరిధిలోని బాగ్ లింగంపల్లి హెచ్ఐజీ కాలనీలో బ్లాక్ నెంబర్ 4, ప్లాట్ నెంబర్ 2 గల రెసిడెన్షియల్ ఫ్లాట్లను అక్రమంగా వాణిజ్య సముదాయాలుగా మార్చడం వల్ల వినియోగదారుల వాహనాలతో తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో స్థానికులు అనేక ఇబ్బందులకు గురి చేసే గురవుతున్నారనీ, సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాంనగర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఆవుల లోకనాథం డిమాండ్ చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో లింగంపల్లిలోని అక్రమ నిర్మాణం వద్ద బుధవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌యాదవ్ మాట్లాడుతూ బాగ్ లింగంపల్లిలోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయనీ, నియంత్రించాల్సిన ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్టుగా వదిలేయడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనంద్‌కుమార్, బీ బ్లాక్ అధ్యక్షులు అంజి యాదవ్, శ్రావణ్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.