Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
సాంప్రదాయ మొక్కల కంటే టిష్యూ కల్చర్ ద్వారా పెరిగిన మొక్కలు శక్తి వంతమైనవని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, సహకార అండ్ మార్కెంటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.4 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయనున్న టిష్యూ కల్చర్ ప్రయోగశాల నిర్మాణ పనులను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ కొండబాల కోటేశ్వరరావు, భారత ప్రభుత్వ రైతు సంక్షేమం, వ్యవసాయశాఖ (సీడ్స్) సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయలక్ష్మీ నాదెండ్ల, రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత్ కె జెండగే, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టిషక్యు కల్చర్ ప్రయోగశాల ప్రభుత్వ రంగంలో ఇదే తొలిది అన్నారు. టిషక్యు కల్చర్ ప్రయోగశాల ద్వారా అనేక ప్రయోజనాలున్నాయన్నారు. మొక్కలు పెంపకానికి, మొక్కలు పునరుత్పత్తికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పండ్లు, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, చెక్క మొక్కలు, అలంకారాలు, జీవ ఇంధనం వంటి మొక్కలను ఈ ప్రయోగశాల ద్వారా తయారు చేసి రాష్ట్ర రైతులకు, హరితహరం కార్యక్రమంలో అందుబాటులో ఉంచేందుకు వీలుగా దోహపడుతుందన్నారు. ఈ ప్రయోగశాల ద్వారా ఒక చిన్న కణజాలం, మొక్కల కణాల నుంచి మొత్తం మొక్కను పునరుత్పత్తి చేయవచ్చని తెలిపారు. ఈ మొక్కలు తల్లి నిజమైన లక్షణాలను కలిగి ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్ జె.శ్రీనివాస్, జీడిమెట్ల ఇంజినీరింగ్ మేనేజర్ ఆర్.నర్సింహారెడ్డి, జీడిమెట్ల ఆర్ఎం కె.కోటిలింగం, ఇతర అధికారులు రవీందర్‌రాజు, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.