Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
తెలంగాణ ఆస్తులను అమ్మే హక్కు ప్రధాని మోడీకి లేదనీ, సింగరేణి బొగ్గు గనులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్ కోరారు. గురువారం హిమాయ త్నగర్లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న బొగ్గు గనులను ప్రైవేటీకరించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కార్మికులు అనేక పోరాటాలు చేస్తున్నారని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టే దుర్మార్గపు ఆలోచనతో 10 రాష్ట్రాల్లోని 88 బ్లాకులను ప్రైవేటీకరించడానికి వేలం పాటకు ప్రకటించిందనీ, రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా వారి అనుమతి లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మే హక్కు కేంద్రానికి లేదన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలు దేశ ఫెడరల్ విధా నాలకు ద్రోహం చేసే విధంగా, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉన్నాయన్నారు. వెంటనే 88 బ్లాకుల వేలం పాటను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కార్మిక వర్గం, బొగ్గుగనుల కార్మికులు రాష్ట్రంలోని బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకించడా నికి, పరిరక్షణకు కోసం సమైక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.