Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-నేరెడ్మెట్
వినాయకనగర్ డివిజన్లో బతుకమ్మ పండుగ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కప కాంప్లెక్స్ బస్టాప్ దగ్గర మా ఫర్నిచర్ షాప్ ఎదుట బుధ, గురు వారాల్లో బతుకమ్మ స్వాగత స్టేజ్ వద్ద బతుకమ్మలను డీజే పాటలకు ఆడినట్టు స్థానిక డివిజన్ కార్పోరేటర్ క్యానం రాజ్యలక్ష్మి తెలిపారు. ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన ఈ వేడుకలకు విచ్చేసిన మహిళలు, నాయకులు, డివిజన్లోని బీజేపీ నా యకులు, కార్యకర్తల సహకారాలకు ధన్యవాదాలు తెలిపా రు. ఈ కార్యక్రమం ఉమామహేశ్వరి రమావత్ సహకా రంతో జరిగిందని అన్నారు. ఓం ప్రకాష్ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కాప్రా : పూలను పూజించే సంస్కతి, సంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదని, అది తెలంగాణకే ప్రత్యేకమని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అన్నారు. శివసాయి నగర్లో జరిగిన బతుకమ్మ సంబురాల్లో ఆయన మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, పావని మణిపాల్ రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్ర మంలో నాయకులు సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, నేమూరి మహే ష్‌గౌడ్, కాసం మైపాల్ రెడ్డి, మణిపాల్ రెడ్డి, జౌండ్ల ప్రభాక ర్‌రెడ్డి, కందాడి సుదర్శన్ రెడ్డి, ఏనుగు సీతారాం రెడ్డి, గణేష్ ముదిరాజ్, డప్పు గిరిబాబు, సారా అనిల్ ముది రాజ్, గంప కష్ణ, రమేష్, చంద్రమౌళి, నాలుగుకాళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి : తెలంగాణ సంస్కృతి సంప్రాదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ పండుగ అనీ, రకరకాల పువ్వులు ప్రకృతిని ఆరాధించే సంస్కృతి ఒక్క తెలంగాణలోనే ఉం దని పలకల రేణుక తెలిపారు. మల్కాజిగిరి డివిజన్ పరిధి లోని మల్కాజిగిరి సర్కిల్ వద్ద గురువారం వివిధ కాలనీ ల్లోని మహిళలు పలకల రేణుక ఆధ్వర్యంలో సద్దుల బతుక మ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింహా సిని, మేఘమాల, పద్మ, మౌనిక, సుజాత, నాగమణి, శోభ, అమృత, నర్సమ్మ, హైమా, ప్రీతి, లక్ష్మి, మున్ని పాల్గొన్నారు.