Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అత్యున్నత సేవల ప్రమాణాలను అందించడంలో ఉద్యోగులు చేస్తున్న నిర్విరామ కృషిని మెర్క్యుర్ హైదరాబాద్ కేసీపీ హోటల్ 'ఎంప్లారు గ్యాడిట్యూడ్ వీక్' గురువారం నిర్వహించింది. కరోనా మహమ్మారి సమ యంలో నిస్వార్థంగా సేవలందించిన ఉద్యోగులను హృద యపూర్వకంగా అభినందించాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మెర్క్యుర్ హైదరాబాద్ కేసీపీ జనరల్ మేనేజర్ శ్రీ సౌమిత్ర పహారీ మాట్లాడుతూ ఎంప్లారు గ్యాడిట్యూడ్ వీక్ వద్ద తమ టీం నుంచి వచ్చిన స్పందన పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. ఈ మూడు రోజుల పండుగను తాము ఉద్యోగుల పట్ల కృతజ్ఞతను చూపుతూ నిర్వహించామని తెలిపారు. ఉద్యోగులే తమకు అత్యంత విలువైన ఆస్తి అనీ, తమ బృందం, వారి ప్రయత్నాల కారణంగా తాము సురక్షి తంగా ఉన్నామనే భావనను పొందగలిగామని తెలిపారు. తమ ఉద్యోగుల నుంచి ఆదరణ సేవలు, మద్దతును తాము పొందగలిగామనీ, వారిని ఏకతాటిపైకి తీసుకురావ డంతోపాటు తమ బృందానికి స్ఫూర్తిని అందించడానికి వీలున్న కార్యక్రమాలను నిర్వహించేందుకు తాము స్థిరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని తెలిపారు.