Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
హుజురాబాద్ ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందను బీజేపీ సీనియర్ నాయకులు మీర్ ఫిరాసత్ అలీ బక్రీ అన్నారు. దారుల్ షిఫా వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 30న జరగనున్న హజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి తప్పదన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర విజయం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందరి అభివృద్ధి, అందరి విశ్వాసంతో ముందుకు సాగుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు నిరాశకు గురయ్యారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పేరుతో ప్రజలను మోసంం చేస్తుందన్నార్ను. దేశ అభివృద్ధి కేంద్రంతోనే సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ దళితుల్ను, ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో దళితుల సంక్షేమం లేదన్నారు. హజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి భయపడి సీఎం కేసీఆర్ దళితులను తప్పుదోవ పట్టించడానికి దళిత బంధు పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. టీఆర్ఎస్ వ్యూహాల గురించి దళితులకు ప్రజలకు బాగా తెలుసు అన్నారు. ఉప ఎన్నికలో అన్ని వర్గాల ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేస్తారన్నారు. తెలంగాణను ఒక కుటుంబమే పాలిస్తుందన్నారు. ప్రభు త్వ త్రికోణం క్వెట్టానీ, కేటీఆర్, కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. బీజేపీ రాజకీయ శక్తి అనీ, తెలంగాణలో ప్రజాదరణ పెరుగుతోందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ము న్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బాగా పని చేసిందనీ, 2023లో తెలంగాణలో ఎలాగైనా కాషాయ జెండా ఎగరేస్తామని దీమా వ్యక్తం చేశారు.